Breaking News

Telangana: గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేయండి     

Published on Fri, 06/02/2023 - 09:29

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్‌–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన పిటిషన్లలో కౌంటర్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్, ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్‌–1 పరీక్ష ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్‌పీఎస్సీ సిబ్బందిలో ఎంత మందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్‌ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు.

యూపీపీఎస్సీ లాంటి కమిషన్‌కు పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలని సూచించారు. ఈ పిటిషన్‌లపై గురువారం జస్టిస్‌ కాజా శరత్‌ విచారణ చేపట్టారు. గత ఏడాది గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలు పూ ర్తయ్యాక ప్రశ్నపత్రాలు లీకేజీ విషయం వెలుగులోకి వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై సర్కార్‌ ఏర్పాటు చేసిన సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారన్నారు. 

మళ్లీ టీఎస్‌పీఎస్సీ నిర్వహణ అంటే ఎలా? 
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని తేలిందని, ఇప్ప టికే 19 మంది దాకా అరెస్టయ్యారని చెప్పారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని, అలాంటప్పుడు అదే సంస్థ పరీక్ష ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఆ బాధ్యతను మరో సంస్థకు అప్పగించాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ తరఫున న్యాయవాది ఎం. రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. లీకేజీ అంశంలో 19 మంది ఉద్యోగులు లేరన్నారు. ఉన్న ఇద్దరు కూడా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 991 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశామని, పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పా రు. వాదనలను విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)