Breaking News

దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్‌ చేసిన శేజల్‌

Published on Wed, 06/07/2023 - 20:17

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్‌ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్‌ విడుదల చేసింది. 

ఇక, ఈ వీడియోలో భాగంగా తాను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ఉన్నట్టు తెలిపింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో(రూమ్‌ నెంబర్‌ 404) తనను మందు తాగమని ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. బిజినెస్‌ మీటింగ్‌లో ఇలా మందు పార్టీ ఎందుకు పెట్టారు. బిజినెస్‌ మీటింగ్‌ అన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి. మందు తాగుతూ నన్ను ఎందుకు వేధింపులకు గురిచేశారు. అది ఎమ్మెల్యే రూమ్‌ కాదని ఆయన మద్దతుదారులు అంటారు. కానీ, ఈ వీడియోలో ఎమ్మెల్యే తన భార్యతో కలిసి ఉన్న ఫొటో ఉంటుంది చూడండి అని అన్నారు. 

ఈ సందర్భంగా తమ వద్ద ఇంకా ఆధారాలు ఉన్నాయని శేజల్‌ చెప్పుకొచ్చింది. తాము అనవసరంగా ఆరోపణలు చేయడంలేదని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు డిలీజ్‌ చేశారని తెలిపింది బాధితురాలు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తుంటే నేనెలా వీడియోలు, ఫొటోలు తీయాలని ప్రశ్నించారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించింది. అప్పటి వరకు ఢిల్లీలోనే ఉంటామని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు.. పనులు కావాలంటే అమ్మాయిలను పంపాల్సిందే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)