Breaking News

ఏపీలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత

Published on Tue, 06/13/2023 - 08:44

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదని, అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బిహార్‌ మాజీ సీఎం బీపీ మండల్‌ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సూరజ్‌ మండల్‌ చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

బీసీల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఆ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం శుభపరిణామమని చెప్పారు. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీలతో మహాధర్నా
బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్‌ కమిషన్‌ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూరజ్‌ మండల్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో బీసీలు సహా.. కులాల వారీగా జనాభా ఎంత ఉందో స్పష్టత వచ్చేలా జనగణన చేయాలన్నారు. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు.

ఆ దిశగానే వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో ఫీజులు పెరిగి పోవడం వల్ల కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలు చదువుకోవడంకష్టమేనన్నారు. జనాభా లెక్కలు తేల్చకుండా  కేంద్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసిందని విమర్శించారు.

చదవండి: కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు: రేవంత్‌ రెడ్డి

Videos

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు.. అవినాష్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

తగ్గుతున్న పసిడి ధరలు కొనడానికి ఇదే ఛాన్సా?

నన్ను ఒక్కసారి గెలిపిస్తే.. యలమంచిలిని అభివృద్ధి చేసి చూపిస్తా

నా మద్దతు CJPకే

టీచర్లకు మెంటల్ టెన్షన్.. ఒకే టీచర్ కు 3 ప్రాంతాల్లో డ్యూటీ.. ఎందుకంటే..!

మీ బెదిరింపులకు భయపడేదేలే... నామినేషన్ వేసి తీరుతాం.. మాస్ వార్నింగ్

నామినేషన్ల గడువు పొడిగించాల్సిందే..! SEC కి సుప్రీం సంచలన ఆదేశాలు

విజయనగరంలో TDP, జనసేన మధ్య కొట్లాట

పెడితే స్టేషన్లో పెట్టు లేదంటే.. నరేన్ రెడ్డి నెక్స్ట్ లెవెల్ ర్యాగ్లింగ్

మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. SECకి సుప్రీం కోర్ట్ సంచలన ఆదేశాలు

Photos

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 18 -అక్టోబర్ 24)

+5

బొమ్మలా అందంగా అదరగొట్టేస్తున్న గాయత్రి భరద్వాజ్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'జైలర్ 2' కాంత.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

అల్లు శిరీష్-నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)