Breaking News

యాదాద్రి జిల్లా రాయగిరి రైతులకు సంకెళ్లు

Published on Tue, 06/13/2023 - 15:08

సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్‌ఆర్‌ఆర్‌ రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు.  రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్‌ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.

 రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పందగా మారింది.నలుగురు రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్‌ ఆర్‌ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు  రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా గత నెల 30న ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్‌ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆరుగురిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిని అదే రోజు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో చూపించారు.

నాలుగో తేదీ వరకు భువనగిరి జైళ్లో ఉంచిన పోలీసులు.. రాజకీయ నేతల పర్యటనలు, ఇతర కారణాలతో రాయగిరి రైతులను నల్గొండ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితులు పిటిషన్‌లు దాఖలు చేయగా.. నలుగురికి బెయిల్‌ మంజూరు అయ్యింది. ఇదే క్రమంలో 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ ముగియడంతో మరోసారి వారిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్‌ మంజూరు అయినందున కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకు రానున్నారు రైతులు.
చదవండి: రంగంలోకి డీకే శివకుమార్‌.. ట్రబుల్‌ షూటర్‌తో రేవంత్‌ రెడ్డి భేటీ

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?