Breaking News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్‌కు రాక

Published on Thu, 06/29/2023 - 17:56

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నారు.

రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు  శంకుస్థాపన చేస్తారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.
చదవండి: జూలై 3న కేంద్ర కేబినెట్‌ భేటీ.. ఆరోజే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అధికార కార్యక్రమాలతోపాటు, బహిరంగ సభకు కాషాయ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర నాయకత్వ మార్పు, బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి, కిషన్‌ రెడ్డికి తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 
చదవండి: Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్‌ సూసైడ్‌ అటెంప్ట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)