Breaking News

ఉగ్రవాదులు టార్గెట్‌ చేసిన రాష్ట్రాలు ఇవేనా?

Published on Tue, 06/06/2023 - 05:31

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు హైదరాబాద్‌–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్‌ గత నెల 24న రీ–రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్‌ చేరుకుంది.

ఏటీఎస్‌ అధికారులతో సమావేశమైన ఈ టీమ్‌.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్‌ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్‌ ఉత్‌ తెహ్రీర్‌ (హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్‌ షరియత్‌ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది.

వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్‌ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది.

ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్‌ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్‌ సలీం, యాసిర్‌ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్‌ తీసుకురావాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది.  

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు