Breaking News

ఆ విషయంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు: కిషన్‌ రెడ్డి

Published on Sat, 06/17/2023 - 12:11

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తెలియజేస్తూ ‘రిపోర్టు టు పీపుల్‌ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో గత తొమ్మిదేళ్లలోతెలంగాణకు కేంద్ర ఇచ్చిన నిధులపై ప్రజలకు నివేదిక అందించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, 9 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఉద్దేశ్యమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. కేంద్రం చెప్పే లెక్కలు-రాష్ట్ర చెబుతున్న లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్‌ నిరంతరం సహకరించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.  గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని అన్నారు. కేంద్రం నుంచి వివిధ శాఖలు 5 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.

‘మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలకు నేషనల్ హైవేల అనుసంధానం చేశారు . వీటి కోసం 1లక్ష 8వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది. హైదరాబాద్‌కు గేమ్ చెంజర్‌గా కానున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించిన భూ సేకరణ తొందరగా పూర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు. 
చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్‌ ఆదేశం

రైల్వేస్..
►9 ఏళ్లలో రాష్ట్రంలో 37 వేల కోట్లకు పైగా రైల్వే లైన్లను డబ్లింగ్ ఏర్పాటు చేశాం.
►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించాం.
►రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజు ఆలస్యం అయ్యింది.
►కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.
►దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది.
►ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయి.
►ప్రజల అభిప్రాయ డిజైన్ మేరకు అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నాం .

పౌర విమానయానం
►భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం.
►2014 తర్వాత తెలంగాణలో 11 సాగు నీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసింది.
►ఇళ్ళ నిర్మాణానికి తెలంగాణకు నిధులు మంజూరు చేసినా ఖర్చు చేయలేదు.
►రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే ఎక్కువ నిధులు తెలంగాణకే కేటాయించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)