Breaking News

HYD: మహిళా కార్పొరేటర్‌తో BRS కీలక నేత అసభ్యకర వ్యాఖ్యలు..

Published on Tue, 06/20/2023 - 12:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తన నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్‌తో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన నేత.. తన వంకర బుద్దిని చూపించారు. రాత్రిళ్లు మహిళా కార్పొరేటర్‌కు ఫోన్‌ చేసి.. వ్యక్తిగత విషయాలను అడగడం, అసభ్యకరంగా మాటాడం తీవ్ర దుమారం రేపింది. ఇక, ఈ విషయం మంత్రి దృష్టికి చేరినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. అధికార పార్టీకి చెందిన కీలక నేత కొంత కాలంగా ఓ మహిళా కార్పొరోటర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఆమె భర్త కూడా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. సదరు నేత వారి వ్యక్తిగత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చనువుగా ఉండేవాడు. అతడి బుద్ది తెలియని ఆమె కూడా తన ఇబ్బందులను వ్యక్తిగత విషయాలను ఆయనతో పంచుకునేది. దీన్ని అనుకూలంగా తీసుకున్న సదరు నేత.. తన వక్రబుద్ధి చూపించారు. 

మూడు రోజల క్రితం ఆమెకు ఫోన్‌ చేసిన నేత.. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. తిన్నావా.. లేదా?. అర్ధరాత్రి వరకూ ఏమీ తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది అంటూ ఓ రకంగా అడిగి, ఆ తర్వాత ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటంతో ఒక్కసారిగా షాకైంది. అనంతరం, ఆయన మాట్లాడిన సంభాషణను ఫోన్‌లో రికార్డు చేసింది. ఈ క్రమంలో ఆ ఆడియోను పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి వద్ద బాధితురాలు కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఆడియో బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)