Breaking News

గ్రూప్‌–4 పరీక్షను బహిష్కరించిన ఓయూ విద్యార్థి నేతలు

Published on Sun, 07/02/2023 - 07:40

లాలాపేట(హైదరాబాద్‌): టీఎస్‌పీఎస్సీ శనివారం నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్షను బహిష్కరించినట్లు ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విషయమై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు.

కానీ ఇప్పటి వరకు అసలైన నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అందుకే గ్రూప్‌–4 పరీక్షకు వెళ్లకుండా బహిష్కరించామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా..  వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్‌–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్‌–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్‌ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది.

చదవండి: ఐదు తరగతులు.. ఒక్కరే మాస్టారు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)