విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన హైదరాబాద్‌ మెట్రో

Published on Sat, 07/01/2023 - 19:44

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది.. మెట్రో రైళ్లలో ‍ప్రయాణించే స్కూల్‌, కాలేజీ విద్యార్థులకు కొత్తగా స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించింది. 20 ట్రిప్పులకు పాసు తీసుకుని 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. జూలై 1 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.  విద్యాసంస్థల ఐడీ కార్డును చూపించి స్టూడెంట్‌ పాస్‌ మెట్రో కార్డును విద్యార్థులు పొందాలని పేర్కొంది.

ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెట్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ వీసీ రెడ్డి, L&T మెట్రో రైల్ హైదరాబాద్ సీఈవో కేవీబీ రెడ్డి శనివారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో స్టూడెంట్ పాస్-2023 ఆఫర్‌ను ప్రారంభించారు. దీని ప్రకారం ఒక విద్యార్ధికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయనున్నారు. ఏప్రిల్ 1,1998 తర్వాత జన్మించిన విద్యార్థులు మాత్రమే పాస్ పొందేందుకు అర్హులు. 

ఈ పాస్‌ సహాయంతో నెల రోజుల్లో 30 రైడ్‌లు చేయవచ్చు  9 నెలల వ్యాలిడిటీతో ఈ పాస్‌ అందిస్తున్నారు. ఈ ఆఫర్ జూలై 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు  అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌లను జేఎన్టీయూ కాలేజీ, ఎస్సార్‌ నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయదుర్గ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.
చదవండి: రేపు వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)