Breaking News

నేటి నుంచి జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశం

Published on Thu, 06/15/2023 - 04:47

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: అగ్రికల్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఏడబ్ల్యూజీ) మినిస్టీరియల్‌ సమావేశాలకు హైదరాబాద్‌ సిద్ధం అయ్యింది. గురువారం నుంచి ఈ నెల 17 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీ య సంస్థల డైరెక్టర్‌ జనరల్స్‌ పాల్గొంటారు.

కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి మొదటిరోజు ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలను ఇందులో ప్రదర్శిస్తారు. అనంతరం వ్యవసాయ డిప్యూటీస్‌ మీటింగ్‌ (ఏడీఎం) జరుగనుంది. ద్వితీయార్ధంలో అగ్రిబిజినెస్‌ ఫర్‌ ప్రాఫిట్, పీపుల్‌ అండ్‌ ప్లానెట్‌ నిర్వహణ, ‘డిజిటల్లీ డిస్కనెక్ట్‌: వ్యవసాయంలో డిజిటల్‌   సాంకేతికతను ఉపయోగించుకోవడం’ కార్యక్రమాలు జరుగుతాయి.

జీ–20 సమావేశంలో పాల్గొనే మంత్రులు, ఇతర ప్రతినిధి బృందాల నాయకులకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్వాగతం పలకడంతో రెండవరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, సుస్థిర జీవవైవిధ్యం, వాతావరణ సమస్యల పరిష్కారాలపై మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల చర్చలు మూడు సమాంతర సెషన్లలో జరుగుతా యి.

మూడవ రోజు భారత్‌ అధ్యక్షతన అగ్రికల్చర్‌ వర్కింగ్‌ గ్రూప్, జీ–20 ఫలితాలను ఆమోదించడంతో మంత్రుల సమావేశం ముగుస్తుంది. అనంతరం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ –ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)కు సాంకేతిక విజ్ఞాన యాత్రకు ప్రతినిధి బృందం వెళ్తుంది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)