Breaking News

హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ భార్యకు డీటీగా ఉద్యోగం 

Published on Tue, 06/20/2023 - 08:24

ఖమ్మంమయూరి సెంటర్‌: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు భార్య భాగ్యలక్క్ష్మికి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) గా ఉద్యోగం ఇచ్చింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన హరితోత్సవం సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావును చండ్రుగొండు రేంజ్‌లో గుత్తికోయలు హత్య చేసిన విషయం విదితమే.

దీంతో ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేíషియాతో పాటు ఖమ్మంలో 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పుడు శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ – తెలంగాణ చాప్టర్, అటవీ జూనియర్‌ ఫారెస్ట్‌ అధికారుల సంఘం, అటవీ క్షేత్రాధికారుల సంఘం, రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, భారత అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఆయన భార్యకు డీటీగా ఉద్యోగం ఇవ్వడంపై మంత్రి పువ్వాడ అజయ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)