భారత్‌ పరివర్తనతోనే కష్టాల నుంచి విముక్తి 

Published on Thu, 06/15/2023 - 05:29

సాక్షి, హైదరాబాద్‌: పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

సాంప్రదాయ పార్టీలు తమ చిత్తశుద్ధి లేని కార్యాచరణతో, మూస పద్ధతితో కూడిన పాలనారీతులు కొనసాగించినంత కాలం దేశాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 

వనరులను ఉపయోగించుకోవాలనే తపన ఉండాలి.. 
‘దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాకెట్‌ సైన్స్‌ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలనే తపన, మనసు పాలకులకు ఉండాలి. ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనా విధానాలు ఏడు దశాబ్దాలుగా పాలకులకు లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం.

భూగోళం మీద ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు భారత్‌ సొంతం. అయినప్పటికీ, ఇన్ని దశాబ్దాలైనా.. రైతులు, బడుగు బలహీన వర్గాలు కనీస అవసరాలైన నీరు విద్యుత్‌ కోసం తపిస్తున్నారు. ప్రభుత్వాలు రైతు కేంద్రంగా, దళిత ఆదివాసీ బలహీన వర్గాలు కేంద్రంగా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలి. మేం అలా చేసుకోగలిగాం కాబట్టే నేడు తెలంగాణ దేశానికే రోల్‌ మోడలయ్యింది..’అని సీఎం తెలిపారు.  

మనసుంటే మార్గం ఉంటుందని తెలంగాణ నిరూపించింది.. 
‘ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే అతి పిన్నవయసున్న తెలంగాణ అత్యంత తక్కువ కాలంలో ఎట్లా ఓ రోల్‌ మోడల్‌ కాగలిగింది? నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్‌నే కోరుకోవడానికి కారణమేంటి?’అనే విషయాలను కేసీఆర్‌ వివరించారు. ‘తెలంగాణను అభివృద్ధి చేసుకున్న పద్ధతిలో ఈ దేశంలో పాలన సాగటం లేదు. దేశంలో పరివర్తన తీసుకువచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేదు.

ప్రజా సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలనే మనసు లేనే లేదు..’ అని విమర్శించారు. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుందనే విషయాన్ని తొమ్మిదేళ్ల తెలంగాణ నిరూపించిందని అన్నారు. అభివృద్ధి దిశగా భారతదేశంలో సమూల మార్పును తీసుకువచ్చేందుకు పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని, అందుకు ముందడుగు మహారాష్ట్ర నుంచి పడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, యువత చైతన్యమై కలసికట్టుగా నిలబడి పార్టీలను కాకుండా ప్రజా ఆంకాంక్షలను గెలిపించుకునేందుకు కృషి కొనసాగించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.  

బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో.. 
ఎన్‌సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్‌ షెలార్‌తో పాటు ఆ పార్టీ ఓబీసీ సెల్‌ అహ్మద్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు సంజయ్‌ ఆనంద్కర్, దర్శకుడు ప్రకాష్‌ నింభోర్, కుక్డి చక్కెర కర్మాగారం సభ్యుడు అబాసాహెబ్‌ షిండే, మాజీ చైర్మన్‌ విలాస్‌ భైలుమే, సర్పంచ్‌లు కేశవ్‌ జెండే, షాహాజీ ఇతాపే, శరద్‌పవార్‌తో పాటు చంద్రకాంత్‌ పవార్, ప్రకాష్‌ పోతే, ప్రశాంత్‌ షెలార్, సిద్ధేష్‌ ఆనంద్కర్, ప్రవీణ్‌ షెలార్, సంజయ్‌ వాగాస్కర్, వహతుక్‌ సేన అధ్యక్షుడు సందీప్‌ దహతోండే, సేవాదళ్‌కు చెందిన షామ్‌ జారే తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర నేతలు ఖదీర్‌ మౌలానా, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)