Breaking News

CM KCR: వారందరికీ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ 4వేలకు పెంపు

Published on Fri, 06/09/2023 - 20:16

సాక్షి, మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం, సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని విక‌లాంగుల‌కు శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ‌లోని విక‌లాంగుల‌కు ఆస‌రా పెన్ష‌న్లు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. పెంచిన పెన్ష‌న్లు వ‌చ్చే నెల నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని స్పష్టం చేశారు. 

కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ స‌మాజం బాగుండాలి.  తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంలో విక‌లాంగుల పెన్ష‌న్ కూడా పెంచ‌బోతున్నాం. ఆస‌రా పెన్ష‌న్ల‌తో అందరూ బాగున్నారు. విక‌లాంగుల‌కు ప్రస్తుతం రూ. 3,116 పెన్ష‌న్ ఇస్తున్నాం. వారికి మ‌రో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గ‌డ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్ర‌క‌టించాల‌ని నేను స‌స్పెన్ష‌న్‌లో పెట్టాను. వ‌చ్చే నెల నుంచి రూ. 4,116 పెన్ష‌న్ అందుతుంది. అంద‌రి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.

ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా రైతులకు రూ.65వేల కోట్టు అందించాం. వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగరేణి టర్నోవర్‌ను రూ.33వేల కోట్లకు పెంచాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్‌ హయాంలో సింగరేణి సర్వనాశం అయ్యింది. దేశంలో బొగ్గుకు కొరత లేదు. 361 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉండగా విద్యుత్‌ను ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణిని కాంగ్రెస్‌ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచాలని చూస్తోంది. వచ్చే దసరాలో సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్‌ ఇవ్వబోతున్నాం. దేశంలోని చెడ్డ పాలసీలను అంతా కలిసి అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. 

ఇది కూడా చదవండి: చెన్నై టూ హైదరాబాద్‌: అప్సర కేసులో సినిమా రేంజ్‌ ట్విస్ట్‌లు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)