Breaking News

ఆ దేవుళ్లు చేసిన పాపమేంటి?

Published on Mon, 06/19/2023 - 05:26

సాక్షి, హైదరాబాద్‌: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. ఇప్పుడు దీన్ని ’’సీఎం వరమిచ్చినా దేవాదాయశాఖ కరుణించడం లేదు’’అని మార్చి చదువుకోవాలి. ధూపదీప నైవేద్యాలకు స్వయంగా సీఎం ముందుకొచ్చినా.. దేవాదాయ శాఖే దాన్ని అడ్డుకుంది. 

గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పథకం కింద అందిస్తున్న భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన సమయంలో కొత్తగా మరో 2,796 దేవాలయాలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.

అప్పటికే ఆ జాబి తా దేవాదాయ శాఖ పరిశీలనలో ఉన్నందున, ఆ జాబితాలోని దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు సీఎం తేల్చి చెప్పారు. కానీ, శనివా రం విడుదలైన ఉత్తర్వుల్లో ఆ సంఖ్యను దేవాదాయశాఖ 2,043గానే చూపింది. నిధుల సాకుతో మిగతా గుడులను అందులో నుంచి తప్పించింది. ఫలితంగా, ఆయా దేవాలయాల్లో దేవరులతోపాటు, ఆ ఆలయాలనే నమ్ముకుని ఉన్న అర్చకులు ఇప్పుడు ఆగమాగమయ్యే గందరగోళ పరిస్థితి నెలకొంది. 

ఒకే జాబితా.. ఎలా తొలగిస్తారు..? 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6 వేలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటిల్లో రూ.2 వేలను దేవుడికి ధూపదీప నైవేద్యానికయ్యే వ్యయానికి వాడుతుండగా, మిగతా మొత్తాన్ని ఆ ఆలయ పూజారి కుటుంబం గడవటానికి భృతిగా వినియోగిస్తున్నారు.

ఆదాయం లేక ఆలనాపాలనా లేని మరిన్ని దేవాలయాలను కూడా దీని పరిధిలోకి తేవాలన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ గత ఏడాది చివరలో ఓ జాబితాను సిద్ధం చేసింది. ప్రతి జిల్లా అదనపు కలెక్టర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ముగ్గురు అర్చకులు.. వెరసి ఐదుగురు సభ్యుల కమిటీ అర్చకుల అర్హతల ఆధారంగా ఎంపికలు జరిపింది. అలా 2,796 మంది పూజారుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఆ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేశారు. 

మిగిలిన 753 దేవాలయాల పరిస్థితేంటి? 
కొంతకాలంగా ధూపదీప నైవేద్య పథకానికి ఆర్థిక శాఖ నిధులు సరిగా ఇవ్వటం లేదు. మూడు నెలల మొత్తం బకాయిగా పేరుకుపోయి ఉంది. గతేడాది చివరలో కూడా నాలుగు నెలల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఈ జాబితాను తగ్గించాలని భావించిన అధికారులు, సీఎం ప్రకటనకు భిన్నంగా కేవలం 2,043 దేవాలయాలకే పథకాన్ని వర్తింపు చేస్తున్నట్టు శనివారం ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆ జాబితాలో 753 దేవాలయాలు మిగిలి పోయాయి.

ఒకేసారి రూపొందిన మొత్తం జాబితాను ఓకే చేయాల్సిందిపోయి, సింహభాగం దేవాలయాలను ఎంపిక చేసి కొన్నింటిని వదిలేయటం ఇప్పుడు గందరగోళంగా మారింది. ప్రభుత్వం నుంచి భృతి రాదని తేలితే వారు ఆ ఆలయాల్లో అర్చకులు కొనసాగే పరిస్థితి అంతగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు