Breaking News

ఏఐల మెదడుకు ఇండియన్లే మేత

Published on Fri, 12/19/2025 - 01:32

ఏఐ యాప్‌లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్‌ యూజర్‌–బేస్‌ మార్కెట్‌గా అవతరించిందని ‘బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌’ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ యాప్‌లకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రోజువారీ, నెలసరి యూజర్లు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా చాట్‌ జీపీటీకి 14.5 కోట్ల నెలవారీ వినియోగదారులు ఉంటే తరువాతి స్థానంలో 10.5 కోట్ల మందితో జెమినై ఉంది.

ఓపెన్‌ ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’, గూగుల్‌కు చెందిన ‘జెమినై’, పెర్‌ప్లెక్సిటీ వంటి యాప్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజువారీ, నెలవారీ యాక్టివ్‌ యూజర్లు భారత్‌లో ఉన్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ నివేదిక వెల్లడించింది.

2025 నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్‌ యూజర్‌లలో.. జెమినైకి 31 శాతం, పెర్‌ప్లెక్సిటీలను 38 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వాటి వినియోగంలోనూ భారత్‌ దూసుకుపోతోంది. ప్రపంచంలోని మొత్తం వాట్సాప్‌ వినియోగదారుల్లో మనవాళ్లు 32 శాతం కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లలో భారతీయులు 31 శాతం కావడం విశేషం.-సాక్షి స్పెషల్‌ డెస్క్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)