Breaking News

టన్నెల్‌లో నిలిచిపోయిన మెట్రో రైలు.. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు

Published on Tue, 12/02/2025 - 11:54

చెన్నైలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న టన్నెల్‌లో అకాలంగా నిలిచిపోయింది. దీనితో ప్రయాణికులు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ప్రారంభ సమయంలో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. రైలులో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు వెలుగు లేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడివారు రికార్డ్‌ చేసిన వీడియోల్లో ప్రయాణికులు హ్యాండ్రెయిల్ పట్టుకుని బయట పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.

అయితే పది నిమిషాల తర్వాత హైకోర్టు స్టేషన్ వరకు (దాదాపు 500 మీటర్లు) నడుచుకుంటూ వెళ్లాలని మెట్రో సిబ్బంది ప్రయాణికులకు తెలిపింది. అనంతరం వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉండొచ్చని అంచనా. అయితే పరిస్థితిని త్వరగా సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు.

అనంతరం ఎక్స్‌లో చెన్నై మెట్రో అధికారులు స్పందిస్తూ ఎయిర్‌పోర్ట్ విమ్కో నగర్ డిపో బ్లూ లైన్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. గ్రీన్ లైన్‌లోని సెంట్రల్ మెట్రో–సెంట్ థామస్ మౌంట్ మార్గంలో కూడా రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.

జరిగిన ఘటన వల్ల ఉదయం ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించడంతో మెట్రో సేవలు మళ్లీ సవ్యంగా కొనసాగుతున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)