Breaking News

●గాలీవాన బీభత్సం

Published on Sat, 06/03/2023 - 00:20

పుట్టపర్తి అర్బన్‌: గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి పుట్టపర్తి, కొత్తచెరువు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి పెనుగాలులు తోడుకావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేల కూలాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. కప్పబండ నుంచి కొత్తచెరువు వరకూ దాదాపు 9 విద్యుత్‌ స్తంభాలు విరిగి పడడంతో గురువారం రాత్రంతా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. శుక్రవారం ఉదయమే అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. జేసీబీలతో భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఇక కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు ఏఈ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు.

8 మండలాల్లో వర్షం..

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలో 8 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 22.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక చెన్నేకొత్తపల్లిలో 11.4 మి.మీ, కొత్తచెరువు 5.8, కనగానపల్లిలో 5.4, తాడిమర్రి 4.2, బుక్కపట్నం 4, చిలమత్తూరు, హిందూపురం మండలంలో 3.8 మి.మీ మేర వర్షం కురిసినట్లు వెల్లడించారు.

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)