Breaking News

ఆటో ఢీకొని బాలుడి మృతి

Published on Sat, 06/03/2023 - 00:20

గుంతకల్లు రూరల్‌: మండల పరిధిలోని నెలగొండ గ్రామంలో శుక్రవారం ఆటో ఢీ కొనడంతో షాన్వాజ్‌ (4) అనే బాలుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. నెలగొండ గ్రామానికి చెందిన రుక్మాన్‌ బాషా, ఖాదర్‌బీ దంపతుల కూతురు అయిన మున్నీని 13 సంవత్సరాల క్రితం గుంతకల్లు మండలంలోని నరసాపురంకు చెందిన దస్తగిరి బాషా అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు , కుమారుడు షాన్వాజ్‌ (4) సంతానం. మున్నీ పుట్టినిళ్లు అయిన నెలగొండలో మూడు రోజులుగా నూతనంగా నిర్మించిన వీరాంజనేయ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగానే మున్నీ కూడా తన పుట్టినింటికి వెళ్లింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు షాన్వాజ్‌ ఉన్నట్టుండి రోడ్డుపైకి వెళ్లాడు. అదేసమయంలో అటు నుంచి వేగంగా వచ్చిన ఆటో బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన షాన్వాజ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)