Breaking News

ఎనిమిదేళ్ల తర్వాత అధికంగా..

Published on Thu, 03/23/2023 - 11:08

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లా నుంచి రైల్వే శాఖకు రాబడి అధికంగా వస్తోంది. ఇందులో ప్రధాన ఆదాయవనరుగా అదానీ కృష్ణపట్నం పోర్టు ఉంది. బొగ్గుతోపాటు ఇతర సరుకులు పెద్దఎత్తున గూడ్స్‌ రైళ్ల ద్వారా రవాణా చేస్తున్నారు.

2014లో టాప్‌
పోర్టు నుంచి వివిధ సరుకుల దిగుమతులు బాగా జరుగుతున్నాయి. వాటిని ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. 2014–15 కాలంలో రైల్వే శాఖ పోర్టు నుంచి 12.94 మిలియన్‌ టన్నుల బొగ్గును తరలించి అప్పట్లో రికార్డు సృష్టించింది. ఆ ఏడాదిలో బొగ్గు వల్లే రూ.1,179 కోట్ల రాబడి వచ్చింది. ఇతర సరుకుల రవాణాతో కలిపి మొత్తంగా రూ.1,988.17 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఏడాదిలో..
ఎనిమిది సంవత్సరాల తర్వాత ఊహించని దానికన్నా ఎక్కువగా బొగ్గు రవాణా జరిగింది. 2022–23 సంవత్సరానికి 13 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించారు. దీంతో సుమారు రూ.1,500 కోట్లు, ఇతర సరుకుల రవాణా ద్వారా రూ.500 కోట్ల రాబడి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 5 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా కాగా రూ.560 కోట్లు, మిగిలిన సరుకుల రవాణా ద్వారా రూ.391 కోట్లు వచ్చింది. గతేడాది కన్నా ఈ ఏడాది అధికంగా రవాణా సరుకుల ద్వారా జిల్లా నుంచి రైల్వేకి అధికంగానే రాబడి వచ్చింది.

నిత్యం 12 గూడ్స్‌ రైళ్ల ద్వారా..
పోర్టు నుంచి నిత్యం 12 గూడ్స్‌ రైళ్ల ద్వారా సరుకులను రైల్వే తరలిస్తోంది. దీంతో రోజుకు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వస్తోందని అంచనా. కాగా బొగ్గుతోపాటు ఎక్కువగా ఎరువులు, ఐరన్‌, లైమ్‌స్టోన్‌ తదితర సరుకులను రవాణా చేస్తుంటారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)