Breaking News

సికిందర్‌ రజా ఊచకోత.. టీ20 క్రికెట్‌లో జింబాబ్వే ప్రపంచ రికార్డు

Published on Wed, 10/23/2024 - 19:18

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ సబ్‌ రీజినల్‌ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్‌ స్కోరు చేసింది. తద్వారా ఇంటర్నేషనల్‌ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.

గాంబియా బౌలింగ్‌ ఊచకోత
నైరోబిలోని రౌరాక స్పోర్ట్స్‌ క్లబ్‌ గ్రౌండ్‌లో జింబాబ్వే గాంబియా(Gambia) జట్టుతో తలపడింది. టాస్‌ గెలిచిన సికందర్‌ రజా బృందం తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రియాన్‌ బెనెట్‌, తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani) గాంబియా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. బ్రియాన్‌ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు రాబట్టగా.. మరుమణి కేవలం 19 బంతుల్లోనే 62 రన్స్‌ సాధించాడు.

సికందర్‌ రజా ఒక్కడే 133 రన్స్‌
వన్‌డౌన్‌ బ్యాటర్‌ డియాన్‌ మైర్స్‌(12) విఫలం కాగా.. కెప్టెన్‌ సికందర్‌ రజా పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 133 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావాళ్లలో రియాన్‌ బర్ల్‌ 11 బంతుల్లో 25, క్లైవ్‌ మడాండే కేవలం 17 బంతుల్లోనే 53(నాటౌట్‌) పరుగులు సాధించారు.
 

చరిత్ర పుటల్లోకి జింబాబ్వే జట్టు
ఫలితంగా కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా నేపాల్‌ పేరిట ఉన్న టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్‌ మంగోలియాపై 314 పరుగులు స్కోరు చేసింది. తాజాగా జింబాబ్వే ఆ రికార్డును బ్రేక్‌ చేసి అత్యధిక పరుగుల జట్టుగా తమ పేరును చరిత్రపుటల్లో లిఖించుకుంది. 

290 పరుగుల భారీ తేడాతో విజయం
జింబాబ్వే విధించిన కొండంత లక్ష్యాన్ని చూసి బెంబేలెత్తిన గాంబియా.. 54 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ జట్టు ఆటగాళ్ల స్కోర్లు వరుస(బ్యాటింగ్‌ ఆర్డర్‌)గా 5,0,7,4,7,1,2,2,0,12*,0. దీంతో జింబాబ్వే ఏకంగా 290 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగర్వా, బ్రాండన్‌ మవుతా మూడేసి వికెట్ల తీయగా.. వెస్లీ మధెవెరె రెండు, ర్యాన్‌ బర్ల్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్‌ భారీ విజయం.. భారత్‌తో పాటు సెమీస్‌లో!
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)