Breaking News

జింబాబ్వేదే టి20 సిరీస్‌

Published on Thu, 02/27/2025 - 03:57

హరారే: సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి పోరు వర్షం కారణంగా రద్దు కాగా... జింబాబ్వే 1–0తో సిరీస్‌ చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన చివరి టి20లో మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. 

కెప్టెన్ సికందర్‌ రజా (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), టోనీ (26), తషింగా (26 నాటౌట్‌) రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో క్రెయిగ్‌ యంగ్, గారెత్‌ డెలానీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్‌ జట్టు లక్ష్యఛేదనకు దిగకముందే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ సాధ్యపడలేదు. ఫలితంగా జింబాబ్వేకు సిరీస్‌ దక్కింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్‌ జట్టు విజయం సాధించగా... అనంతరంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వే 2–1తో గెలుపొందింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)