Breaking News

జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్‌ 157 ఆలౌట్‌

Published on Fri, 01/03/2025 - 08:45

బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్‌ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.

రషీద్‌ ఖాన్‌ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్‌ దాటలేకపోయారు. కెపె్టన్‌ హష్మతుల్లా (13), రహమత్‌ షా (19), అబ్దుల్‌ మాలిక్‌ (17), రియాజ్‌ హసన్‌ (12), అఫ్సర్‌ (16), షహీదుల్లా (12), ఇస్మత్‌ ఆలమ్‌ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.

జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, న్యూమన్‌ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్‌ గుంబీ (4 బ్యాటింగ్‌), బెన్‌ కరన్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.
చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్‌ బుమ్రా ఏమన్నాడంటే?

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)