Breaking News

పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం​ జింబాబ్వే జట్ల ప్రకటన

Published on Mon, 11/18/2024 - 18:58

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్‌ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా క్రెయిస్‌ ఎర్విన్‌.. టీ20 జట్టు సారధిగా సికందర్‌ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు (ట్రెవర్‌ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో  సికందర్‌ రజా, సీన్‌ విలియమ్స్‌, బ్లెస్సింగ్‌ ముజరబాని, రిచర్డ్‌ నగరవ లాంటి సీనియర్‌ ప్లేయర్లు.. క్లైవ్‌ మదండే, బ్రియాన్‌ బెన్నెట్‌, డియాన్‌ మైర్స్‌ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. 

టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌, సీన్‌ విలియమ్స్‌, జాయ్‌లార్డ్‌ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్‌ జట్టు నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాక్‌ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌ల కోసం పాక్‌ మేనేజ్‌మెంట్‌ బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్‌ ఇచ్చింది.

జింబాబ్వే పర్యటనలో పాక్‌ షెడ్యూల్‌..

నవంబర్‌ 24- తొలి వన్డే 
నవంబర్‌ 26- రెండో వన్డే
నవంబర్‌ 28- మూడో వన్డే

డిసెంబర్‌ 1- తొలి టీ20
డిసెంబర్‌ 3- రెండో టీ20
డిసెంబర్‌ 5- మూడో టీ20

మ్యాచ్‌లన్నీ బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ మైదానంలో జరుగనున్నాయి.

జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్‌ మైర్స్‌, రిచర్డ్‌ నగరవ, సికందర్‌ రజా, సీన్ విలియమ్స్.

జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్‌ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్‌ మైర్స్‌, రిచర్డ్ నగరవ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)