Breaking News

తిప్పేసిన రషీద్‌ ఖాన్‌

Published on Sat, 11/01/2025 - 04:15

హరారే: స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బంతితో విజృంభించడంతో జింబాబ్వేతో జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్‌ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గానిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను మట్టికరిపించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో చేజిక్కించుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 19.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. 

కెప్టెన్‌ సికందర్‌ రజా (32 బంతుల్లో 37; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. బ్రెండన్‌ టేలర్‌ (3), మయెర్స్‌ (6), బెనెట్‌ (16), ర్యాన్‌ బుర్ల్‌ (10), మున్‌యోంగా (19), ముసెకివా (13), ఇవాన్స్‌ (12) విఫలమయ్యారు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ముజీబ్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్‌ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (51 బంతుల్లో 57 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో రాణించగా... అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ (13 బంతుల్లో 25 నాటౌట్‌; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు. 

వికెట్‌ కీపర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (16; 2 ఫోర్లు, 1 సిక్స్‌), డార్విస్‌ రసూలి (17) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఇవాన్స్‌ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నామమాత్రమైన చివరి టి20 జరగనుంది.   

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)