Breaking News

శ్రీలంక‌కు షాకిచ్చిన జింబాబ్వే

Published on Fri, 11/21/2025 - 07:26

ముక్కోణపు టీ20 టోర్నమెంట్‌ తొలి పోరులో ఆతిథ్య పాకిస్తాన్‌ చేతిలో ఓడిన జింబాబ్వే... ఆ పరాజయం నుంచి వేగంగా కోలుకొని సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి టోర్నీలో బోణీ కొట్టింది. గురువారం రావల్పిండి వేదిక‌గా జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. 

టీ20ల్లో శ్రీలంకతో పదోసారి ఆడిన జింబాబ్వే మూడో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బ్రియాన్‌ బెనెట్‌ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ సికందర్‌ రజా (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. 

వీరిద్దరూ మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు పడగొట్టగా... ఇషాన్‌ మలింగ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా విఫలమై 95 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ దసున్‌ షనక (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాజపక్స (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఇవాన్స్‌ 3, రిచర్డ్‌ నగరవా 2 వికెట్లు తీశాడు.
చదవండి: ‘యాషెస్‌’ సమరానికి సిద్ధం
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)