Breaking News

పసికూన చేతిలో పరాభవం.. శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే

Published on Sun, 09/07/2025 - 07:31

పసికూన జింబాబ్వే చేతిలో శ్రీలంక జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 6) జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జింబాబ్వే బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వేపై ఓ ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్‌.

అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే సైతం ఇబ్బంది పడినా..  ఎలాగోలా 14.2 ఓవర్లలో సగం వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించింది.

చెలరేగిన జింబాబ్వే బౌలర్లు
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే ఆది నుంచే శ్రీలంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి ఒక్క బౌలర్‌ లంక ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. సికందర్‌ రజా (4-0-11-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (2.4-0-15-3), ముజరబానీ (3-0-14-2), సీన్‌ విలియమ్స్‌ (4-0-19-1) అత్యుత్తమంగా రాణించారు. లంక ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కమిల్‌ మిషారా (20) టాప్‌ స్కోరర్‌ కాగా.. అసలంక 18, షకన 15 పరగులు చేశారు.

చమటోడ్చిన జింబాబ్వే 
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు జింబాబ్వే తీవ్రంగా శ్రమించింది. 81 పరుగులను ఛేదించేందుకు ఆ జట్టు సగం​ వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లు తీసుకుంది. చమీరా (4-0-19-3), తీక్షణ (4-0-28-1), బినుర ఫెర్నాండో (3-0-14-1) జింబాబ్వే బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయినా ర్యాన్‌ బర్ల్‌ (20 నాటౌట్‌), తషింగ ముసేకివా (21 నాటౌట్‌) నిలకడగా ఆడి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. సిరీస్‌ డిసైడర్‌ అయిన మూడో టీ20 సెప్టెంబర్‌ 7న జరుగనుంది.

 

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)