Breaking News

సిరీస్‌ కైవసం చేసుకున్న జింబాబ్వే

Published on Tue, 09/16/2025 - 21:26

స్వదేశంలో నమీబియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం​ చేసుకుంది. బులవాయో వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 16) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా జింబాబ్వేనే గెలుపొందింది. 33 పరుగుల తేడాతో పర్యాటక జట్టును ఓడించింది. నామమాత్రపు చివరి టీ20 సెప్టెంబర్‌ 18న బులవాయో వేదికగా జరుగనుంది.

రాణించిన క్రుగర్‌, లాఫ్టీ
తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా.. మలాన్‌ క్రుగర్‌ (45), లాఫ్టీ ఈటన్‌ (47) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (37), జాన్‌ ఫ్రైలింక్‌ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. చివరి ఓవర్లలో నమీబియా బ్యాటర్లు ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకుని పెద్ద స్కోర్‌ చేయలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఈవాన్స్‌, రిచర్డ్‌ నగరవ తలో 2 వికెట్లు తీయగా.. మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

చెలరేగిన బెన్నెట్‌.. సత్తా చాటిన మరుమణి
170 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆది నుంచి ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (40), మరుమణి (50) పోటీపడి పరుగులు రాబట్టారు. 

అనంతరం బ్రెండన్‌ టేలర్‌ (29), ర్యాన్‌ బర్ల్‌ (24 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝులిపించడంతో జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో స్మిట్‌ 2, బెర్నాల్డ్‌ స్కోల్జ్‌, ట్రంపల్‌మన్‌ తలో వికెట్‌ తీశారు. ముసేకివా సిక్సర్‌ కొట్టి జిం‍బాబ్వేను గెలిపించాడు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)