Breaking News

విధ్వంసం సృష్టించిన బెన్నెట్‌.. జింబాబ్వే ఘన విజయం

Published on Mon, 09/15/2025 - 18:17

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నమీబియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 15) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు.. ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (51 బంతుల్లో 94; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మరుమణి (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

ఆఖర్లో ర్యాన్‌ బర్ల్‌ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ సికందర్‌ రజా (11 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో నమీబియా కెప్టెన్‌ ఎరాస్మస్‌ తనతో సహా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. అలెగ్జాండర్‌ 2, ట్రంపల్‌మెన్‌కు ఓ వికెట్‌ దక్కింది

అనంతరం​ భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయినా లక్ష్యానికి 34 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నమీబియా ఇన్నింగ్స్‌ల్లో తలా కొన్ని పరుగులు చేశారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 

నికోల్‌ లాఫ్టీ (38), జేన్‌ గ్రీన్‌ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, ముజరబానీ తలో 2 వికెట్లు తీసి నమీబియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. మసకద్జ, నగరవ, బ్రాడ్‌ ఈవాన్స్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 రేపు (సెప్టెంబర్‌ 16) జరుగనుంది.

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)