Breaking News

కొనసాగుతున్న సీన్‌ విలియమ్స్‌ భీకర ఫామ్‌.. వదిలితే రన్‌మెషీన్‌ను మిం​చిపోయేలా ఉన్నాడు..!

Published on Sun, 07/02/2023 - 15:34

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో జింబాబ్వే వెటరన్‌ బ్యాటర్‌ సీన్‌ విలియమ్స్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు (102*, 174, 142), ఓ భారీ హాఫ్‌ సెంచరీ (91) సాయంతో 532 పరుగులు చేసిన విలియమ్స్‌.. ఇవాళ (జులై 2) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీ (56) సాధించి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లిని మరిపించాడు.

విరాట్‌ 5 వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాల సాయంతో 596 పరుగులు చేస్తే.. విలియమ్స్‌ ఇంచుమించు విరాట్‌ రికార్డును సమం చేసినంత పని చేశాడు. సీన్‌ విలియమ్స్‌ ఫామ్‌ వన్డేల వరకే పరిమితమైందనుకుంటే పొరపాటే. ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ టెస్ట్‌ల్లోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్స్‌ చివరిగా ఆడిన 5 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 

కాగా, విలియమ్స్‌ పరుగుల ప్రవాహం కొనసాగుతుండటంతో వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే విజయ యాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు సూపర్‌ సిక్స్‌లో శ్రీలంకతో సమానంగా 6 పాయింట్లు సాధించి , వన్డే వరల్డ్‌కప్‌-2023 బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. 

అయితే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్‌లో మాత్రం జింబాబ్వే చేతులెత్తేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. సీన్‌ విలియమ్స్‌ (56) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్‌ రజా (31) కాస్త పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ (4/25), మధుశంక (3/15), పతిరణ (2/18), షనక (1/30) చెలరేగిపోయారు.   
      

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)