Breaking News

సీన్‌ విలియమ్స్‌ సూపర్‌ సెంచరీ.. తప్పిన ఫాలో ఆన్‌ గండం

Published on Mon, 06/30/2025 - 10:06

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (ZIM vs SA 1st Test)లో జింబాబ్వే ఫాలో ఆన్‌ గండం తప్పించుకుంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ సీన్‌ విలియమ్స్‌ (Sean Williams- 164 బంతుల్లో 137; 16 ఫోర్లు) సెంచరీ సాధించి ఈ మేరకు ఊరట కల్పించాడు. బులవాయో వేదికగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. 

కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (90 బంతుల్లో 36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. బ్రియాన్‌ బెనెట్‌ (19), కిటానో (0), నిక్‌ వెల్చ్‌ (4), వెస్లీ మధెవెరె (15), ప్రిన్స్‌ (7), తఫద్జా ట్సిగా (9), మసకద్జా (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు.

ముల్డర్‌కు నాలుగు వికెట్లు
ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ 4 వికెట్లు పడగొట్టగా... కేశవ్‌ మహరాజ్, యూసుఫ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది.

ఓపెనర్లలో మాథ్యూ బ్రీజ్కె (1) అవుట్‌ కాగా... టోనీ డి జోర్జి (22 బ్యాటింగ్‌; 2 ఫోర్లు).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముల్డర్‌ (25 బ్యాటింగ్‌; 4 ఫోర్లు)తో కలిసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 418/9 వద్దే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. దీంతో ఓవరాల్‌గా చేతిలో 9 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ప్రస్తుతం 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తద్వారా జింబాబ్వేతో తొలి టెస్టులో పట్టు బిగించింది.

కేశవ్‌ మహరాజ్‌@ 200
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న కేశవ్‌ మహరాజ్‌... అరుదైన ఘనత సాధించాడు. సఫారీ జట్టు తరఫున 200 టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వే కెప్టెన్‌ ఇరి్వన్‌ను అవుట్‌ చేయడం ద్వారా కేశవ్‌ మహరాజ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో 200వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. 9 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 35 ఏళ్ల కేశవ్‌... ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 202 వికెట్లు పడగొట్టాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)