Breaking News

అద్భుతమైన సెంచరీ.. ఆండీ ఫ్లవర్‌ తర్వాతి స్థానంలో సీన్‌ విలియమ్స్‌

Published on Sun, 06/29/2025 - 19:13

బులవాయో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే వెటరన్‌ బ్యాటర్‌ సీన్‌ విలియమ్స్‌ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో (23/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి 121 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38 ఏళ్ల విలియమ్స్‌కు టెస్ట్‌ల్లో ఇది ఆరో శతకం. 

సెంచరీ అనంతరం కూడా విలియమ్స్‌ పోరాటం కొనసాగిస్తూ జింబాబ్వేను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. విలియమ్స్‌ ప్రస్తుతం 134 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మసెకెస (4) క్రీజ్‌లో ఉన్నాడు. 

రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 176 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కైటానో 0, వెల్చ్‌ 4, క్రెయిగ్‌ ఎర్విన్‌ 36, వెస్లీ మెదెవెరె 15, మసౌరే 7, ట్సిగా 9, మసకద్జ 4 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (19) రిటైర్ట్‌ హర్ట్‌గా (తలకు గాయం) వెనుదిరగాడు. 

బెన్నెట్‌ ఈ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగడు. అతని స్థానంలో మసౌరేను కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది జింబాబ్వే మేనేజ్‌మెంట్‌. సౌతాఫ్రికా బౌలర్లలో యూసఫ్‌ కోడి, వియాన్‌ ముల్దర్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. కేశవ్‌ మహారాజ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153), కార్బిన్‌ బాష్‌ (100 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్‌ 17, బెడింగ్హమ్‌ 0, వెర్రిన్‌ 10, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ 21, కోడి యూసఫ్‌ 27, మఫాకా 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్‌ తీశారు.

ప్లవర్‌ సరసన విలియమ్స్‌
ఈ మ్యాచ్‌లో సెంచరీతో విలియమ్స్‌ జింబాబ్వే మాజీ ఆటగాళ్లు గ్రాంట్‌ ఫ్లవర్‌, బ్రెండన్‌ టేలర్‌ సరసన చేరాడు. ఫ్లవర్‌, టేలర్‌, విలియమ్స్‌ టెస్ట్‌ల్లో తలో ఆరు సెంచరీలు చేసి జింబాబ్వే తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీల రికార్డు ఆండీ ఫ్లవర్‌ పేరిట ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)