amp pages | Sakshi

Zim Vs Ire: ఐర్లాండ్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సిరీస్‌ కైవసం

Published on Mon, 01/16/2023 - 10:01

Zimbabwe vs Ireland, 3rd T20I: సొంతగడ్డపై జింబాబ్వే సత్తా చాటింది. ఐర్లాండ్‌తో మూడో టీ20లో విజయం సాధించింది. పర్యాటక జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకై ఐర్లాండ్‌ జింబాబ్వేలో పర్యటిస్తోంది.

ఈ క్రమంలో హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో జిం‍బాబ్వే ఆఖరి వరకు పోరాడి ఎట్టకేలకు జయకేతనం ఎగురవేసింది.

టెక్టర్‌ ఒక్కడే
ఐర్లాండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్‌ 47 పరుగులతో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కర్టిస్‌ కాంఫర్‌ 27, డాక్రెల్‌ 23 పరుగులతో రాణించారు.


సిరీస్‌ విజేత జింబాబ్వే (PC: Zimbabwe Cricket)

చివరి వరకు పోరాడినా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన క్రెయిగ్‌ ఎర్విన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అర్ధ శతకం(54)తో రాణించి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నాడు. అయితే, ఐర్లాండ్‌ మాత్రం పట్టు సడలించలేదు.

ఈ దశలో ఆల్‌రౌండర్‌ ర్యాన్‌ బర్ల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 11 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గత రెండు మ్యాచ్‌లలోనూ రాణించిన అతడు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు.

జింబాబ్వే వర్సెస్‌ ఐర్లాండ్‌ మూడో టీ20 స్కోర్లు
ఐర్లాండ్‌- 141/9 (20)
జింబాబ్వే- 144/6 (19) 

చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!
IND vs SL: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. విరాట్‌ ఏం చేశాడంటే?

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)