Breaking News

ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత

Published on Sat, 12/28/2024 - 07:37

బులవాయో: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు కూడా జింబాబ్వే జోరే కొనసాగింది. దీంతో ఆ జట్టు తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (176 బంతుల్లో 104; 10 ఫోర్లు), బ్రియాన్‌ బెనెట్‌ (124 బంతుల్లో 110 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో మొత్తం మూడు శతకాల మోత మోగింది. తొలిరోజు ఆటలో సీన్‌ విలియమ్స్‌ సెంచరీ సాధించాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 363/4తో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 135.2 ఓవర్లలో 586 పరుగుల వద్ద ఆలౌటైంది. 2001లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జింబాబ్వే చేసిన 563/9 స్కోరే ఇప్పటిదాకా అత్యధిక పరుగులు కాగా... ఇప్పుడా రికార్డును సవరించింది.

ఓవర్‌నైట్‌ బ్యాటర్లలో విలియమ్స్‌ ఎంతోసేపు నిలువలేదు. ఇర్విన్‌... తర్వాత వచ్చిన బెనెట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. టెయిలెండర్లు న్యుమన్‌ న్యామ్‌హురి (26; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ముజరబని (19; 1 ఫోర్, 1 సిక్స్‌) చేసిన పరుగులతో జింబాబ్వే అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 3, నవీద్‌ జద్రాన్, జహీర్‌ ఖాన్, జియావుర్‌ రహ్మాన్‌ తలా 2 వికెట్లు తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అఫ్గానిస్తాన్‌ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు సిదిఖుల్లా అతల్‌ (3), అబ్దుల్‌ మాలిక్‌ (23; 1 ఫోర్‌) నిష్క్రమించగా.. రహ్మత్‌ షా (49 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (16 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్‌ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)