Breaking News

సీన్‌ విలియమ్స్‌ అజేయ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా జింబాబ్వే

Published on Fri, 12/27/2024 - 10:19

బులవాయో: జింబాబ్వే పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టులో ఆతిథ్య బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెన్‌ కరన్‌ (74 బంతుల్లో 68; 11 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కైటానో (115 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 49 పరుగులు జతచేశారు. కరన్‌ నిష్క్రమించాక వచ్చిన సీన్‌ విలియమ్స్‌ (161 బంతుల్లో 145 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అఫ్గాన్‌ బౌలర్లపై వన్డేను తలపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు.

కైటానోతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు, అనంతరం మైయెర్స్‌ (27; 3 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. తర్వాత విలియమ్స్, కెప్టెన్‌ ఇర్విన్‌ (94 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లోనే విలియమ్స్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇర్విన్‌ కూడా అర్ధసెంచరీ సాధించడంతో ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2, నవీద్‌ జద్రాన్, జహీర్‌ ఖాన్‌ చెరో వికెట్‌ తీశారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)