Breaking News

టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్‌ క్రికెటర్‌ సుడిగాలి శతకం

Published on Thu, 09/26/2024 - 20:50

టీ10 క్రికెట్‌లో సంచనలం నమోదైంది. జిమ్‌ ఆఫ్రో లీగ్‌-2024లో స్కాట్లాండ్‌ క్రికెటర్‌ జార్జ్‌ మున్సే సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. డర్బన్‌ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్సే (హరారే బోల్ట్స్‌) కేవలం 38 బంతుల్లో శతక్కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. జిమ్‌ ఆఫ్రో లీగ్‌ చరిత్రలో ఇదే తొలి సెంచరీ. 

మున్సే సెంచరీతో శివాలెత్తడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన హరారే బోల్ట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. బోల్ట్స్‌ ఇన్నింగ్స్‌లో మున్సే సెంచరీ తర్వాత ఎక్స్‌ట్రాల రూపంలో (29) అత్యధిక పరుగులు వచ్చాయి. జనిష్క పెరీరా 24, లహీరు మిలంత 13, దసున్‌ షనక 7 పరుగులు చేశారు. వోల్వ్స్‌ బౌలర్లలో దౌలత్‌ జద్రాన్‌ రెండు వికెట్లు తీశాడు.

174 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వోల్వ్స్‌.. ఏ దశలో గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కొలిన్‌ మున్రో (32), షర్జీల్‌ ఖాన్‌ (25), విల్‌ స్మీడ్‌ (16), ఇన్నోసెంట్‌ కాలా (16), రిచ్‌మండ్‌ ముతుంబామి (15) రెండంకెల స్కోర్లు చేశారు. బోల్ట్స్‌ బౌలర్లలో రిచర్డ్‌ గ్లీసన్‌ 2, బ్రాండన్‌ మవుటా, దసున్‌ షనక, జేమ్స్‌ నీషమ్‌, అరినెస్టో వెజా తలో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: కమిందు మెండిస్‌.. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి ఆటగాడు..!

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)