Breaking News

చరిత్ర సృష్టించిన పాక్‌ బౌలర్‌.. పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు

Published on Sat, 07/22/2023 - 13:32

పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌ టీ10 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పాక్‌ మాజీ పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో భాగంగా బులవాయో బ్రేవ్స్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌల్‌ చేసిన హఫీజ్‌ (జోబర్గ్‌ బఫెలోస్‌).. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ట్రిపుల్‌ వికెట్‌ మొయిడిన్‌ ఓవర్‌ ఉంది.

హఫీజ్‌ వేసిన 12 బంతుల్లో కేవలం ఒకే ఒక బౌండరీ ఇచ్చి 11 డాట్‌ బాల్స్‌ వేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్‌లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 400 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్‌ 250కిపైగా వికెట్లు తీసినప్పటికీ, ఒక్కసారి కూడా 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టలేకపోయాడు. టెస్ట్‌ల్లో 4/16, వన్డేల్లో 4/41, టీ20ల్లో 4/10 హఫీజ్‌ అత్యుత్తమ గణాంకాలు.

ఇదిలా ఉంటే, బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ బఫెలోస్‌ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్‌; 8 ఫోర్లు) చెలరేగగా.. ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఫరాజ్‌, వెబ్‌స్టర్‌, సికందర్‌ రజా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన బ్రేవ్స్‌.. మహ్మద్‌ హఫీజ్‌ (2-1-4-6) ధాటికి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. హఫీజ్‌ బ్రేవ్స్‌ పతనాన్ని శాశిస్తే.. వెల్లింగ్టన్‌ మసకద్జ (2-0-11-3) మరో ఎండ్‌ నుంచి అతనికి సహకరించాడు. బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్‌ (22 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (13), ర్యాన్‌ బర్ల్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్‌ డకౌట్లు కావడం విశేషం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)