Breaking News

తొమ్మిది వికెట్లు తీసిన చహల్‌

Published on Thu, 09/12/2024 - 15:37

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-2 పోటీల్లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్‌.. డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్‌, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్‌ డెర్బీషైర్‌పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తంప్టన్‌షైర్‌ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్‌ జైబ్‌ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్‌ బ్రాడ్‌ (45) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. డెర్బీషైర్‌ బౌలర్లలో జాక్‌ చాపల్‌, ఆండర్‌సన్‌, జాక్‌ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్‌, రీస్‌, థాంప్సన్‌, లాయిడ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన డెర్బీషైర్‌.. చహల్‌ (5/45), రాబ్‌ కియోగ్‌ (3/65), సాండర్‌సన్‌ (1/17), జస్టిన్‌ బ్రాడ్‌ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌లో రీస్‌ (50), మాడ్‌సన్‌ (47), గెస్ట్‌(28), డొనాల్డ్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్‌షైర్‌
54 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్తంప్టన్‌షైర్‌ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్‌ కియోగ్‌ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్‌, జాక్‌ మార్లీ చెరో 3, హ్యారీ మూర్‌ 2, జాక్‌ చాపెల్‌, థాంప్సన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

టార్గెట్‌ 266
266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్‌ను రాబ్‌ కియోగ్‌ (5/44), చహల్‌ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్‌ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్‌ ఇన్నింగ్స్‌లో వేన్‌ మాడ్సన్‌ (48 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పృథ్వీ షా
ఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్‌ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకు ఔటయ్యాడు.

చదవండి: ఐదేసిన చహల్‌

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)