Breaking News

చాహ‌ల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లోనే

Published on Tue, 05/07/2024 - 23:03

టీమిండియా స్పిన్న‌ర్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌(అంత‌ర్జాతీయ క్రికెట్‌, లీగ్‌లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భార‌త‌ బౌల‌ర్‌గా చాహ‌ల్ రికార్డుల‌కెక్కాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన చాహ‌ల్‌.. ఈ అరుదైన ఫీట్‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. చాహ‌ల్ ఇప్పటివ‌ర‌కు 350 వికెట్లు ప‌డ‌గొట్టాడు. చాహ‌ల్ త‌ర్వాత స్ధానంలో భార‌త మాజీ స్పిన్న‌ర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.

ఇక ఐపీఎల్‌లో సైతం అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా చాహ‌ల్(201) కొన‌సాగుతున్నాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్‌ ఫ్రెజర్‌ మెక్‌ గర్క్‌(20 బంతుల్లో 50), అభిషేర్‌ పోరెల్‌(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ మెరుపులు మెరిపించాడు.

20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్‌.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్‌, బౌల్ట్‌, సందీప్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)