Breaking News

బౌలర్లను ఉతికారేసిన యువరాజ్‌.. సిక్సర్ల వర్షం! వీడియో

Published on Sat, 07/13/2024 - 12:04

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌లను ఇండియా ఛాంపియన్స్ 86 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది. నార్తాంప్టన్ వేదిక‌గా జ‌రిగిన ఈ సెమీస్ పోరులో ఇండియా ఛాంపియ‌న్స్ కెప్టెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

ఆసీస్ బౌల‌ర్ల‌ను యువీ ఊచ‌కోత కోశాడు. యువరాజ్ కేవ‌లం 28 బంతుల్లో 59 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు సింగ్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రి కొంతమంది ఆసీస్ అంటే అంత క‌సి ఎందుకన్న అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. 

గ‌తంలో కూడా ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై యువీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2000లో ఆసీస్‌తో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్లో 84 ప‌రుగులు చేసిన యువీ.. 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీపైన‌ల్లో కంగరూల‌పై హాఫ్ సెంచ‌రీతో విరుచుకు ప‌డ్డాడు. 

2011 క్వార్ట‌ర్ ఫైన‌ల్‌, 2014 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఈ సిక్స‌ర్ల వీరుడు హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విజ‌యంతో భార‌త్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది.  శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది.

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)