Breaking News

యువ‌రాజ్‌, రాయుడు విధ్వ‌ంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా

Published on Sun, 03/09/2025 - 10:54

అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్‌ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్‌ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్‌ యువరాజ్‌​ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు.

విండీస్‌ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్‌క్రీత్‌ సింగ్‌ మానన్‌(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో బెన​, కార్టర్‌, టేలర్‌ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్‌ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాటర్లలో డ్వైన్‌ స్మిత్‌(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్‌ పెర్కిన్స్‌(52) హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

లెండల్‌ సిమిన్స్‌( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్‌ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్‌ నేగి రెండు, ఇర్ఫాన్‌​ పఠాన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.
చదవండి: Champions Trophy final: 'అత‌డు 20 ఓవ‌ర్లు ఆడితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ భార‌త్‌దే'

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)