Breaking News

వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువ‌రాజ్‌.. ఫోటోలు వైర‌ల్‌

Published on Mon, 05/06/2024 - 18:30

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.  కాగా ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్‌లో సందడి చేసిన యువరాజ్‌.. వరల్డ్‌కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్‌పై వరల్డ్‌కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువ‌రాజ్ త‌న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.  కాగా 2007లో జ‌రిగిన మొద‌టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌రఫున ప్రాతినిధ్యం వ‌హించిన యువీ.. టైటిల్ గెలవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 

ఈ టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువ‌రాజ్ ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు బాదాడు. ఇప్ప‌టికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అంటే యువ‌రాజ్ సింగ్ కోసం ప్ర‌తీ ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

 ఈ నేప‌థ్యంలోనే యువీని ఐసీసీ  బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియ‌మించింది. యువీ.. ఉసెన్‌ బోల్ట్‌తో క‌లిసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)