Breaking News

గిల్ ఒక అత్య‌ద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్‌: యువరాజ్‌

Published on Thu, 08/14/2025 - 20:15

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా గిల్ వంద‌కు వంద మార్క్‌లు కొట్టేశాడు. కెప్టెన్‌గా త‌న తొలి సిరీస్‌లోనే అంద‌ర‌ని ఆక‌ట్టుకున్నాడు.

అత‌డి సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2 స‌మం చేసింది. అదేవిధంగా ఆండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో గిల్ 754 లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో గిల్‌పై టీమిండియా లెజెండ‌రీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఇంగ్లండ్ వంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో జ‌ట్టును బాగా న‌డిపించాడ‌ని గిల్‌ను యువీ కొనియాడాడు. కాగా గిల్ రోల్ మోడ‌ల్ యువీనే కావ‌డం విశేషం.

"ఇంగ్లండ్ టూర్‌కు ముందు గిల్ విదేశీ రికార్డుల‌పై ఎన్నో సందేహాలు, ప్ర‌శ్న‌లు ఉండేవి. కానీ వాటిన్న‌టిని ఒక్క సిరీస్‌తో చెరిపేశాడు. కెప్టెన్ అయ్యాక అత‌డు ఇంగ్లండ్ వంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో ఏకంగా నాలుగు టెస్టు సెంచ‌రీలు చేశాడు. కెప్టెన్‌గా త‌న తొలి టెస్టు సిరీస్‌లో ఈ విధ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచడం నిజంగా అత్య‌ద్బుతం. 

ఓవ‌ల్‌లో చారిత్ర‌త్మ‌క విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టు ప‌ట్ల చాలా గ‌ర్వంగా ఉంది. డ్రా అయిన‌ప్ప‌టికి సిరీస్ మ‌నదేన‌ని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యువ భారత జట్టు. ఇంగ్లండ్ వంటి జట్టుతో సిరీస్ డ్రా చేయడం అంత సులువు కాదు. అదేవిధంగా జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 

చాలా రోజుల తర్వాత ఇద్దరూ భారత బ్యాటర్లు సెంచరీలు చేసి మ్యాచ్‌ను డ్రా ముగించడం చూశాను. జడేజా ఎప్పటి నుంచో జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. కానీ సుందర్ మాత్రం ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా గ్రేట్" అని యువరాజ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)