Breaking News

‘సచిన్‌, గంభీర్‌, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’

Published on Wed, 06/18/2025 - 21:10

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఒక్కడి కోసం.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు ఎంతో మంది గొప్ప ఆటగాళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించాడు.

ఒ​క్కడికి అండగా నిలిచేందుకు సర్వనాశనం
ఈ మేరకు.. ‘‘సీనియర్ల నుంచి సౌరవ్‌, సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), వీవీఎస్‌ లక్ష్మణ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, అని కుంబ్లే.. యువతరం నుంచి భజ్జీ (హర్భజన్‌ సింగ్‌), యువీ (యువరాజ్‌ సింగ్‌), వీరూ (వీరేందర్‌ సెహ్వాగ్‌), మహ్మద్‌ కైఫ్‌, జహీర్‌ ఖాన్‌.

తండ్రులు- కుమారులు.. పెద్దన్నలు- తమ్ముళ్ల కలయికతో జట్టు ఎంతో బాగుండేది. సీనియర్ల సలహాలతో జూనియర్లు రాటుదేలేవారు. కానీ మనం ఏం చేశాం?.. ఒ​క్కడికి అండగా నిలిచేందుకు మన ఇంటిని మనమే నాశనం చేసుకున్నాం.

అతడి పేరును నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కానీ ఈరోజుకీ అతడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పగలను. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జట్టు పరిస్థితి ఎలా ఉంది?

సచిన్‌ అలాంటివాడే..
స్వార్థం కోసం ఇతరుల కెరీర్‌ను నాశనం చేసేవాళ్లు కొందరైతే.. కొంతమంది నిస్వార్థంగా ఇతరులను ప్రేమిస్తారు. సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌, గౌతం గంభీర్‌ లాంటివాళ్లు రెండో కోవకు చెందిన వారు.

ఇతరుల కోసం వారు ఆడతారు. స్టార్లు కావాలన్న తాపత్రయం వారికి లేదు’’ అంటూ యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యులైన వారిపై ఎలాంటి కారణం లేకుండానే బీసీసీఐ సెలక్టర్లు వేటు వేశారని ఆరోపించాడు.

ధోనిని ఉద్దేశించేనా?
‘‘గౌతం గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, మహ్మద్‌ కైఫ్‌ వంటి వాళ్ల కెరీర్‌ను బీసీసీఐ సెలక్టర్లు నాశనం చేశారు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వారిని బయటకు పంపేశారు’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఉద్దేశించే యోగ్‌రాజ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా అతడు ధోని తన కుమారుడు యువీ కెరీర్‌ను నాశనం చేశాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా.. పేరు చెప్పకపోయినప్పటికీ ధోనిని దృష్టిలో పెట్టుకునే యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇలా మాట్లాడి ఉంటాడని క్రికెట్‌ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. 

కాగా ధోని కెప్టెన్‌గా వచ్చిన తర్వాత జట్టులో మార్పులు చేస్తూ యువ తారలతో నింపేశాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాలు అతడి హయాంలోనే ఎదిగారు. ఇక సారథిగా ధోని టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ అందించాడు. 
చదవండి: Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే బ్యాటింగ్‌ చేస్తాడు: రిషభ్‌ పంత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)