Breaking News

ఫైనల్లో యూకీ జోడీ

Published on Sat, 03/01/2025 - 05:44

దుబాయ్‌: భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ ఈ ఏడాది తొలి టైటిల్‌ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. దుబాయ్‌ చాంపియన్‌షిప్‌ ఏటీపీ–500 టో ర్నీలో అలెక్సీ పాపిరిన్‌ (ఆ్రస్టేలియా)తో కలిసి యూకీ బాంబ్రీ పురుషుల డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ–పాపిరిన్‌ ద్వయం 6–2, 4–6, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జేమీ ముర్రే (బ్రిటన్‌)–జాన్‌ పీర్స్‌ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. 

82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్‌ జోడీ రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. ఈ గెలుపుతో 32 ఏళ్ల యూకీ తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ–500 స్థాయి టో ర్నీలో ఫైనల్‌కు చేరాడు. అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) టూర్‌లో యూకీ మూడు డబుల్స్‌ టైటిల్స్‌ సాధించి, మరో మూడు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)