Breaking News

దమ్ముంటే వరల్డ్‌కప్‌ గెలవండి: బాబర్‌కు పాక్‌ మాజీ బ్యాటర్‌ సవాల్‌

Published on Mon, 06/03/2024 - 18:47

వన్డే వరల్డ్‌కప్‌-2023లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్‌ .. టీ20 ఫార్మాట్లో మాత్రం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఎనిమిదో ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న బాబర్‌ ఆజం బృందం.. ఈసారి తమ తలరాతను మార్చుకోవాలని పట్టుదలగా ఉంది.

అయితే, టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు పాక్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. బాబర్‌ స్థానంలో షాహిన్‌ ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా రావడం.. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో​ సిరీస్‌లో 5-0తో వైట్‌వాష్‌ కావడం.. ఆ తర్వాత బాబర్‌ తిరిగి పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. పాక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో మిలిటరీ టైప్‌ ట్రెయినింగ్‌ రూపంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో కూడా పాక్ చిత్తుగా ఓడిపోయింది.

దమ్ముంటే ఈసారి వరల్డ్‌కప్‌ సాధించు
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ బాబర్‌ ఆజంను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. దమ్ముంటే ఈసారి వరల్డ్‌కప్‌ గెలిచి చూపించాలంటూ సవాల్‌ విసిరాడు.

ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్‌ క్రికెటర్ల క్రమశిక్షణ గురించి మాట్లాడాలంటే తెల్లారిపోతుంది. మనం ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు.

అయితే, క్రికెట్‌ గురించి మాత్రం మాట్లాడొచ్చు కదా! జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్నపుడు, నా కంటే ఎవరూ ఎక్కువ కాదనే భావనలో మునిగిపోయినపుడు.. వరల్డ్‌కప్‌ గెలిచి చూపించాలి.

ఇప్పటికే ఐదు టోర్నమెంట్లు ఆడినా.. మీలో మార్పు రాకపోతే ఎలా?’’ అంటూ ఓ టాక్‌ షోలో మాజీ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ బాబర్‌ ఆజంపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. 

కాగా అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2024లో పాక్‌ జట్టు టీమిండియా, ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏతో పాటు గ్రూప్‌-ఏలో ఉంది. జూన్‌ 6న యూఎస్‌ఏతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

ప్రపంచకప్‌-2024: పాకిస్తాన్‌ జట్టు
బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.

చదవండి: T20 WC 2024: ఈసారి ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)