Breaking News

#ShubmanGill: లవ్‌ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్‌ మిస్‌ చేశాడు!

Published on Fri, 06/09/2023 - 21:40

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న శుబ్‌మన్‌ గిల్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్‌లోనూ గిల్‌ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్‌ చేసే చాన్స్‌ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో ఇది జరిగింది. 

ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. 

అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్‌లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది.  వాస్తవానికి గిల్‌ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా.  గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్‌ చేశారు.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఒక దశలో ఫాలోఆన్‌ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్‌ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ భారీ ఆధిక్యం లభించింది.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో విజయావకాశాలు ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్‌ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది.

చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్‌ చరిత్రలో అత్యుత్తమ షాట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)