సురుచికి స్వర్ణం

Published on Sun, 12/07/2025 - 03:06

దోహా: భారత యువ షూటర్‌ సురుచి సింగ్‌... అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) సీజన్‌ చివరి వరల్డ్‌కప్‌ ఫైనల్లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో సురుచి 245.1 పాయింట్లతో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్‌ సైన్యం 243.3 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. 

ఒలింపిక్‌ పతక విజేత మనూ భాకర్‌ 179.2 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో సురుచి 586, మనూ భాకర్‌ 578, సైన్యం 573 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సామ్రాట్‌ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. 

ఫైనల్లో సామ్రాట్‌ 221.5 పాయింట్లు సాధించాడు. తొలి రోజు పోటీల్లో భారత ఎయిర్‌ రైఫిల్‌ షూటర్లు నిరాశ పరిచారు. రుద్రాం„Š  పాటిల్, అర్జున్‌ బబూతా వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌ 9వ స్థానంతో సరిపెట్టుకుంది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)