Breaking News

కాంస్యం కోసం యువ భారత్‌ పోరు

Published on Sat, 10/26/2024 - 04:04

కౌలాలంపూర్‌: జొహర్‌ కప్‌ అండర్‌–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. టాప్‌–2లో నిలిచిన ఆ్రస్టేలియా, బ్రిటన్‌ జట్లు టైటిల్‌ కోసం పోటీపడనుండగా... మూడో స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ జట్లు కాంస్య పతకం కోసం తలపడతాయి. 

5–6 స్థానాల కోసం జపాన్, ఆతిథ్య మలేసియా జట్లు ఆడతాయి.  వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు నాలుగో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా కళ్లెం వేసింది. ఒక్క గోల్‌ సమర్పించుకోకుండా భారత్‌ఫై నాలుగు గోల్స్‌ సాధించి ఆ్రస్టేలియా ఘనవిజయం నమోదు చేసుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత జట్టు ఫైనల్‌కు చేరుకునేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను భారత జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.

భారత్‌ తరఫున గుర్జోత్‌ సింగ్‌ (6వ నిమిషంలో), రోహిత్‌ (17వ నిమిషంలో), తాలెమ్‌ ప్రియోబర్తా (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. న్యూజిలాండ్‌ జట్టుకు జాంటీ ఎల్మెస్‌ (17వ, 32వ, 45వ నిమిషాల్లో) ఏకంగా మూడు గోల్స్‌ అందించాడు. కివీస్‌తో మ్యాచ్‌ ‘డ్రా’ కావడంతో భారత జట్టు ఫైనల్‌ బెర్త్‌ ఖరారయ్యేది ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధార పడింది. 

అయితే బ్రిటన్‌ జట్టు 3–1తో జపాన్‌పై, ఆ్రస్టేలియా 9–3తో మలేసియాపై ఘనవిజయం సాధించాయి. ఫలితంగా బ్రిటన్, ఆ్రస్టేలియా, భారత జట్లు 10 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా ఆ్రస్టేలియా, బ్రిటన్‌ తొలి రెండు స్థానాల్లో నిలువగా... భారత్‌కు మూడో స్థానం దక్కింది.  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)