Breaking News

క్రికెట్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో క్రికెటర్‌ మృతి

Published on Sun, 02/26/2023 - 16:05

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వసంత్ రాథోడ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పలు నివేదికలు ప్రకారం.. అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్‌లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తూ హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జీఎస్టీ విభాగంలో సీనియర్ క్లర్క్‌గా వసంత్ పనిచేస్తున్నాడు.  "వసంత్‌ రాథోడ్‌ జట్టు ఫీల్డింగ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అతడు బౌలింగ్ చేసే సమయంలో బాగానే ఉన్నాడు. అయితే ఫీల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని సహాచరులు ఆసుపత్రికి తీసుకు వెళ్ళేటప్పటికే అతడు మరణించాడు" అని జీఎస్టీ విభాగం సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నాడు. కాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. రాజ్కోట్ లో ప్రశాంత్ భరోలియా(27), సూరత్లో జిగ్నేష్ చౌహాన్(31) క్రికెట్‌ మైదానంలోనే గుండెపోటుతో మరణించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
చదవండి: Team india: హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)